ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
అగ్ర హీరో ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డారంటూ బుధవారం మీడియాలో వార్తలొచ్చాయి. ఆయన పెద్దప్రమాదం బారిన పడ్డారని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. వీటిపై ఎన్టీఆర్ వ్యక్తిగత బృందం స్పందించింది.
అగ్ర హీరో ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డారంటూ బుధవారం మీడియాలో వార్తలొచ్చాయి. ఆయన పెద్దప్రమాదం బారిన పడ్డారని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. వీటిపై ఎన్టీఆర్ వ్యక్తిగత బృందం స్పందించింది. మీడియాలో ప్రచారం అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది.
‘రెండు రోజుల క్రితం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమచేతికి చిన్న గాయమైంది. ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత మంగళవారం ఆయన ‘దేవర’ షూటింగ్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోలుకుంటున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అభిమానులు నమ్మొద్దని కోరుతున్నాం’ అని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘దేవర’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

