Captain Miller | మిల్లర్ మిల్లర్.. కెప్టెన్ మిల్లర్.. జాన్ కొక్కెన్ సెల్ఫీ వైరల్
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). ఈ చిత్రంలో జాన్ కొక్కెన్ (John Kokken)కీలక పాత్రలో నటిస్తున్నాడు. మిల్లర్ మిల్లర్.. కెప్టెన్ మిల్లర్ అంటూ లొకేషన్లో దిగిన సెల్ఫీ స్టిల్స్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో కొక్కెన్ (John Kokken)కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కెప్టెన్ మిల్లర్ అప్డేట్ ఇస్తూ.. జాన్ కొక్కెన్ దిగిన సెల్ఫీ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మిల్లర్ మిల్లర్.. కెప్టెన్ మిల్లర్ అంటూ లొకేషన్లో దిగిన సెల్ఫీ స్టిల్స్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. జాన్ కొక్కెన్ కెప్టెన్ మిల్లర్ షూటింగ్ అప్డేట్ ఇలా ఇచ్చాడని అంటున్నారు ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. చాలా సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన జాన్ కొక్కెన్ కెప్టెన్ మిల్లర్‌లో ఎలాంటి రోల్ చేస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అగ్ర తమిళ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్‌ను ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Miller Miller……..Captain Miller#shootingspot #shootingdiaries #captainmiller #captainmillerteaserjuly2023 pic.twitter.com/9QRnSDLtGM
— John Kokken (@highonkokken) June 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

