Jayasudha: జయసుధ మొహం ఇలా అయిపోయిందేంటి?

సహజనటి జయసుధ విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, అభినయానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ఇటీవలి కాలంలో జయసుధ అందరికి చాలా దూరంగా ఉంటుంది. ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అనారోగ్యం వలన ఆమె అమెరికాలో ఉంటున్నట్టు సమాచారం.
ఒకప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉండే ఈమె.. కొన్ని నెలలుగా ఎందుకో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. భర్త నితిన్ కపూర్ మరణం తర్వాత ఈమెకు సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. జయసుధ కొడుకు నిహార్ కపూర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. రీసెంట్గా జయసుధ షేర్ చేసిన పిక్ అందరు షాక్ అయ్యేలా చేసింది.
ఎంతో కళగా ఉండే జయసుధ ముఖం కాస్త పీక్కుపోయినట్టు కనిపిస్తుంది. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేయగా, ఈ పిక్ చూసి అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆరాలు తీస్తున్నారు. జయసుధకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఆమె హైదరాబాద్ తిరిగి రాబోతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సంచలనాలు రేపారు జయసుధ. కేవలం హోమ్లీ హీరోయిన్‌గానే కాకుండా బికినీ వేసి ఓ టైమ్‌లో వెండితెరను వేడెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

