Jawan Movie | | ఓటీటీలోకి వచ్చేస్తున్న జవాన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Jawan Movie | ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్‌తో కలెక్షన్ కోత సృష్టిస్తే. ద్వితియార్థంలో జవాన్‌తో కలెక్షన్ల మోత జరిగింది. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జవాన్ సినిమా కోట్లు కొల్లగొట్టింది.
Jawan Movie | ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్‌తో కలెక్షన్ కోత సృష్టిస్తే. ద్వితియార్థంలో జవాన్‌తో కలెక్షన్ల మోత జరిగింది. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జవాన్ సినిమా కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.1150 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక నెట్ లెక్కలు చూసుకుంటే.. రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఈ ఏడాది పఠాన్‌తో వెయ్యి కోట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు జవాన్‌తో పఠాన్ రికార్డులను పాతాళానికి పంపుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమవుతుందా అని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ కట్ వెర్షన్ మరోలా ఉండబోతుందని, కత్తెర పడిన చాలా సీన్స్‌ను ఓటీటీ వెర్షన్లో యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందీ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ లెంగ్త్ 3 గంటలపైమాటే అట. కాగా థియేటర్లో ఈ సినిమా 2గంటల 45 నిమిషాల నిడివితో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా షారుఖ్‌కు ఇచ్చిన ఎలివేషన్లకు నార్త్ ఆడియెన్స్ ఊగిపోయారు.
ఎప్పుడూ లేనిది సౌత్ ఇండియాలో కూడా షారుఖ్ సినిమాకు రీజినల్ భాషల్లో కోట్లుల్లో కలెక్షన్లు వస్తున్నాయి. సౌత్‌లో ఆహా ఓహా అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ.. హిందీ ఆడియెన్స్ మాత్రం షారుఖ్ యాక్షన్, అట్లీ డైరెక్షన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇక తొలిసారి ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న తొలి ఇండియన్ హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

