Hayao Miyazaki : జపాన్ ఫేమస్ యానిమేటర్కు 20 ఏళ్ల తర్వాత రెండో ఆస్కార్
Hayao Miyazaki : జపాన్ ప్రఖ్యాత యానిమేటర్ హయావో మియాజాకి రెండోసారి ఆస్కార్ దక్కింది. ద బాయ్ అండ్ ద హీరన్ చిత్రానికి వర్క్ చేసినందుకు ఆయన్ను ఆ అవార్డు వరించింది. అయితే దాదాపు 20 ఏళ్ల బ్రేక్ తర్వాత హయావో రెండో సారి ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం విశేషం.
లాస్ ఏంజిల్స్: జపాన్ ప్రఖ్యాత యానిమేటర్ హయావో మియాజాకి(Hayao Miyazaki)… ఈ ఏడాది ఆస్కార్ అందుకున్నాడు. ద బాయ్ అండ్ ద హీరన్ చిత్రానికి వర్క్ చేసినందుకు ఆయన్ను ఆ అవార్డు వరించింది. అయితే దాదాపు 20 ఏళ్ల బ్రేక్ తర్వాత హయావో రెండో సారి ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం విశేషం. 2003లో తొలిసారి అతను తన ఖాతాలో ఆస్కార్ వేసుకున్నాడు. స్పిరిటెడ్ అవే చిత్రానికి ఆ అవార్డు దక్కింది. ద బాయ్ అండ్ ద హీరన్ చిత్రాన్ని సెమీ ఆటోబయోగ్రఫీ తరహాలో తీశారు. ఆస్కార్స్‌లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ క్యాటగిరీలో అది అవార్డును ఎగురేసుకుపోయింది.
యానిమేషన్ హౌజ్ స్టూడియో గిబ్లి వ్యవస్థాపకుడు ఈయనే. 2014లో హయావో గౌరవ ఆస్కార్‌ను కూడా అందుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో ప్రత్యేక శైలితో హయావో ఆకట్టుకున్నాడు. గడిచిన దశాబ్ధంలో తాను పనిచేయడం సంతోషకరంగా ఉందన్నాడు.
83 ఏళ్ల జపాన్ యానిమేటర్ హయావో మియాజాకి తీసిన ద బాయ్ అండ్ ద హీరన్ చిత్రానికి గ్లోడెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కింది. డిస్నీ తీసిన ఎలిమెంటల్, స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ద స్పైడర్ వర్స్ చిత్రాలను బీట్ చేసిందా సినిమా. ఓ చిన్న పిల్లోడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తల్లికి దూరమైన తర్వాత ఓ బాతు లాంటి పక్షికి దగ్గరవుతాడు. ఆ కథాంశంతోనే బాయ్ అండ్ ద హీరన్ చిత్రాన్ని తీశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

