Jani Master | డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి తొలగించడంపై స్పందించిన జానీ మాస్టర్
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే.
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. జానీను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వార్తలకు సంబంధించి తాజాగా జానీ మాస్టర్ స్పందించాడు.
ఉదయం నుంచి ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నన్ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఎవరు నమ్మకండి. ఇవి ఫేక్. నన్ను ఏ అసోసియేషన్ నుంచి తొలగించలేదు. నా కార్డును ఎవరు తీసేయలేదు. నేను ఇప్పటికే డ్యాన్సర్ అసోసియేషన్‌లో సభ్యుడినే. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అంటూ జానీ చెప్పుకోచ్చాడు.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv
— Jani Master (@AlwaysJani) December 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

