ఎన్టీఆర్ తన అభిమాన నటుడని..ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఆనందిస్తానని బాలీవుడ్ తార జాన్వీ కపూర్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలిపింది. ఆమె కోరుకున్న అవకాశమే తలుపు తట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది.
ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్‌ను మొదట నాయికగా అనుకున్నా…తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడా అవకాశం జాన్వీకి దక్కినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కొత్త ఏడాదిలో ప్రారంభం కాబోతున్నది. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ అల్లుకున్న ఈ కథలో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తున్నది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీగా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.