జగపతిబాబు, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకుడు. కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా మంగళవారం ఈ సినిమా నుంచి ‘ఆ నింగీ ఈ నేల’ అని సాగే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మెలొడీ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
కృష్ణవేణి మల్లవజ్జల రాసిన ఈ పాటను కార్తీక్ బి.కోడకండ్ల స్వరపరిచి, ఆలపించారు. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో, కుటుంబ అనుబంధాలను ఆవిష్కరిస్తూ పాట సాగింది. జగపతిబాబు, లయ మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. అవసరాల శ్రీనివాస్, రవివర్మ, జెన్నీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల, కెమెరా: చోటా కె.నాయుడు.