ఈ ఏడాది అగ్ర హీరో పవన్ కల్యాణ్ డైరీ ఖాళీగా లేదు. వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’- వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబం ధించిన రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ముంబయి, హైదరాబాద్, మహాబలిపురంలో జరిపిన షెడ్యూల్స్‌లో యాక్షన్ ఘట్టాలతో పాటు ఓ పాటను తెరకెక్కించారు.
తాజా సమాచారం ప్రకారం జూన్ మొదటివారంలో ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. ఇందులో కీలకమైన టాకీ పార్ట్‌ను తెరకెక్కిస్తారని చెబుతున్నారు. ‘ఓజీ’ షూటింగ్ విషయంలో పవన్‌కల్యాణ్ దూకుడుగా ఉన్నారని, సాధ్యమైనంత తొందరలో చిత్రాన్ని పూర్తి చేయబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.