Thalapathy Vijay | మరో టాలీవుడ్ దర్శకుడికి విజయ్ గ్రీన్ సిగ్నల్.. ఈ సారైనా హిట్టు కొడతాడా?
Thalapathy Vijay Next Movie | ప్రస్తుతం కోలివుడ్ హీరోలు టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు. సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా సరే కోట్లు కొల్లగొట్టొచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు దర్శకులు, తెలుగు బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు.
Thalapathy Vijay Next Movie | ప్రస్తుతం కోలివుడ్ హీరోలు టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు. సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా సరే కోట్లు కొల్లగొట్టొచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు దర్శకులు, తెలుగు బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు. వీటితో వాళ్ల సినిమాకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అదే విధంగా మార్కెట్ కూడా పెరిగే చాన్స్ ఉంది. ఇక ఇప్పటికే విజయ్ ‘వారసుడు’, శివకార్తికేయన్ ‘ప్రిన్స్’, ధనుష్ ‘సార్’ ఇలా వీరందరు తెలుగు వాళ్ళతో సినిమాలు తీసి వాళ్ల మార్కెట్ పెంచుకున్నారు. కాగా తాజాగా విజయ్ మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
‘క్రాక్’, ‘వీరసింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల బొమ్మలు తీసిన గోపిచంద్ మలినేనితో విజయ్ ఓ ద్విభాషా చిత్రం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే గోపిచంద్, విజయ్ను కలిసి ఓ మాస్ యాక్షన్ కథను వినిపించినట్లు టాక్. కథ నచ్చడంతో విజయ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. వారసుడితో బోటా బోటి మార్కులు వేయించుకున్న విజయ్.. ఈ సినిమాతో తెలుగులో భారీ విజయం సాధిస్తాడో లేదో చూడాలి.
ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవలే రిలీజైన గ్లింప్స్ ఎక్కడలేని అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

