Gopichand Malineni | సన్నీడియోల్ SDGM రీమేకా.. గోపీచంద్ మలినేని ఏమన్నాడంటే..?
Gopichand Malineni | గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎస్డీజీఎం (SDGM)గా వస్తోంది. ఇటీవలే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
Gopichand Malineni | బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ట్రాక్‌పై ఉన్నాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) . ఈ లీడింగ్ డైరెక్టర్ ఇటీవలే బాలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకరైన సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడని తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఎస్డీజీఎం (SDGM)గా వస్తోంది. ఇటీవలే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తున్నట్టు వార్తలు వచ్చినప్పటి నుంచి ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. సన్నీడియోల్తో చేస్తున్న సినిమా రవితేజ హీరోగా తెరకెక్కించిన క్రాక్ రీమేక్ అని వార్తలు ఊపందుకోగా.. రవితేజతో ప్రకటించి వాయిదా పడ్డ సినిమా కథనే సన్నీడియోల్తో చేస్తున్నాడంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. దీనిపై ఓ హిందీ పోర్టల్‌తో గోపీచంద్ మలినేని క్లారిటీ ఇచ్చాడు. SDGM రీమేక్ కాదని, సన్నీడియోల్‌ను మైండ్‌లో పెట్టుకొని రాసుకున్న కొత్త కథ అని చెప్పాడు.
కాగా త్వరలోనే ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలను వెల్లడించున్నాడట గోపీచంద్ మలినేని. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్తో గోపీచంద్ మలినేని ఏకంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఎలాంటి రికార్డులు కొల్లగొడుతాడోనని ఆసక్తిగా చర్చించుకున్నారు సినీ జనాలు.
Make way for the biggest action film of the country – #SDGM 🔥
Starring Action Superstar @iamsunnydeol 💪🏻
Directed by @megopichand 💥
Produced by @MythriOfficial & @peoplemediafcy ❤️🔥MASS FEAST LOADING!
Shoot begins soon.@MusicThaman @RishiPunjabi5 @artkolla pic.twitter.com/hwsEji2X4a— Mythri Movie Makers (@MythriOfficial) June 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

