Trisha Krishnan | సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పెళ్లిపై సోషల్ మీడియాలో మరోసారి ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆమె మెడలోని ఒక లాకెట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ఫొటోలో త్రిష ధరించిన పెండెంట్‌ను నిశితంగా గమనించిన నెటిజన్లు, అది వంద శాతం కేరళ క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో ఉండే ‘మిన్ను’ (మంగళసూత్రం) అని వాదిస్తున్నారు.
దీంతో ఇంటర్నెట్లో ఒక్కసారిగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసలు త్రిషకు సీక్రెట్‌గా పెళ్లయిపోయిందా? పెళ్లికూతురు ఇక్కడే ఉంది కానీ పెళ్లికొడుకు ఎక్కడ? అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇది కేవలం ఏదైనా సినిమా షూటింగ్‌కు సంబంధించిన లుక్ అయ్యిండవచ్చని, లేదా సాధారణ జ్యువెలరీ డిజైన్ అయ్యిండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా త్రిష పెళ్లిపై అనేక రూమర్స్ రాగా, ఆమె వాటిని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ వైరల్ పిక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే దీనిపై త్రిష టీమ్ ఇప్పటివరకు స్పందించలేదు.
HOLD UP… TRISHA KRISHNAN IS MARRIED?! 🤯😰💔
Look closely at the pendant guys! That is a 100% typical Kerala Christian style Mangalsutra (Minnu)!!! 📿✨😱
Now the ultimate question is… WHO IS THAT BRIDEGROOM?! 🕵️♂️🔥
Ponnu inga iruku… Maplai enga?????🤷♂️👀🔊 Internet is… pic.twitter.com/rhYPlWOpvI
— 🔥 Satz 🔥 (@thala_speaks) June 7, 2026