ఇష్టమంటేనే ఇంత కష్టమా..
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్'. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్ సమర్పకుడు. సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్ సమర్పకుడు. సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈసినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా.. పొంగిపోతున్నా ఈ ఒక్కమాటకీ.. ఇష్టమంటేనే ఇంత కష్టమా.. లొంగిపోతున్నా నీ పిచ్చిప్రేమకీ..’ అంటూ సాగే ఈ లవ్ మెలొడీని భాస్కరభట్ల రవికుమార్ రాయగా, విజయ్ బుల్గానిన్ స్వరపరిచారు.
రామ్ మిర్యాల, లిప్సిక ఆలపించారు. హీరోలోని నిస్వార్థమైన ప్రేమకు మెస్మరైజ్ అయిన హీరోయిన్ భావోద్వేగానికి లోనవుతూ పాడిన పాట ఇదని సాహిత్యం వింటే అర్థమవుతున్నది. ఈపాటలో శ్రీవిష్ణు, మహిమా నంబియార్ల కెమిస్ట్రీ యువతను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. 1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంత నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, నిర్మాణం: స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

