Ooru Peru Bhairavakona | ఊరు పేరు భైరవకోన సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సినిమా విడుదలైన తర్వాత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. రానురానూ ఈ సినిమాపై పాజిటివిటీ పెరిగింది. దీంతో కేవలం 10 రోజుల్లోనే రూ.25కోట్లకు పైగా వసూలు చేసి హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు వచ్చిన మౌత్ టాక్ చేసిన ఆడియన్స్.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఊరు పేరు భైరవకోన ఓటీటీ రిలీజ్పై ఓ అప్డేట్ వచ్చింది.
సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్గా వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 దక్కించుకుందని తెలుస్తోంది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత 28 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా విడుదలయ్యింది. అంటే మార్చి 15న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలుడనుందని సమాచారం.