ముంబై : మాజీ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్‌తో (David Beckham) బాలీవుడ్ సెలబ్రిటీలు కలవడం అరుదుగా జరుగుతుంది. ఈ అకేషన్‌ను బాలీవుడ్ దిగ్గజాలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మాజీ స్టార్ ఫుట్‌బాలర్ యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత్‌లో మూడు రోజుల పర్యటనకు రావడం ఈ అపురూప కలయికకు వేదికైంది.
డేవిడ్ బెక్‌హామ్‌కు సోనం కపూర్ ముంబై నివాసంలో గ్రాండ్ వెల్కం లభించింది. స్టార్ ప్లేయర్ కోసం సోనం, ఆనంద్ అహుజా దంపతులు లావిష్ వెల్కం పార్టీ ఏర్పాటు చేయగా షాహిద్ కపూర్-మిరా రాజ్‌పుత్, పర్హాన్ అక్తర్-శివానీ దండేకర్, ఆధార్ పూనావాలా, అర్జున్ కపూర్, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు.
ఈ పార్టీ విశేషాలను బాలీవుడ్ నటులు సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేశారు. డేవిడ్ బెక్‌హామ్‌తో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను సెలబ్రిటీలు షేర్ చేశారు. బెక్‌హామ్‌ను బాలీవుడ్ స్టార్స్ తమ టీనేజ్ క్రష్‌గా రాసుకొచ్చారు.
Read More
MS Dhoni | ఉత్తరాఖండ్‌లోని పూర్వీకుల ఇంట్లో ధోనీ.. ఫొటోలు వైరల్