ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించిన అందాల కథానాయిక ఇంద్రజ. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై జడ్జి చేస్తుంది. ఆ మధ్య రోజా కొద్ది రోజులు జబర్ధస్త్‌కు బ్రేక్ ఇవ్వడంతో ఆ స్థానంలో ఇంద్రజ కూర్చుంది. ఉన్నన్ని రోజులు చాలా వినోదం పంచింది. తిరిగి ఇంద్రజని తీసుకురమ్మని ఆమె అభిమానులు డిమాంగ్ చేస్తున్నారు.
ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు షోలలో పాల్లొంటున్న ఇంద్రజ.. రీసెంట్గా స్టార్ మాలోని ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోకి వెళ్లారు. అక్కడ పలు గేమ్స్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించిన ఇంద్రజ.. తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు తండ్రి అంటే ఇష్టమని, చిన్నప్పటి నుంచి అన్నీ ఆయనే అని ఇంద్రజ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్నే వంట చేసేవారు.
అమ్మతో పాటు మమ్మల్ని బాగా చూసుకునే వారు. ఏది కావాలంటే అది ఇచ్చేవారు. అలా మాకు అమ్మైనా నాన్నైనా అన్నీ ఆయనే అయ్యారు. తండ్రి ప్రేమను ఎవ్వరూ అంతగా గుర్తించరు. కానీ తండ్రి అనే వారు లేకుంటే కుటుంబం అనేది ఉండదు అని ఇంద్రజ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.