CSpace | వినోదరంగంలో నూతన అధ్యాయం. గవర్నమెంట్ ఓటీటీ ప్లాట్‌ఫాం వచ్చేసింది
CSpace | వినోదరంగంలో ప్రైవేట్ సంస్థలదే టాప్ పొజిషన్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ ఆధారంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. కాగా తొలిసారి మార్కెట్లోకి ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫాం ఎంట్రీ ఇచ్చింది.
CSpace | వినోదరంగంలో ప్రైవేట్ సంస్థలదే టాప్ పొజిషన్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా రకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ ఆధారంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. కాగా తొలిసారి మార్కెట్లోకి ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫాం ఎంట్రీ ఇచ్చింది. భారత తొలి ఓటీటీ ప్లాట్‌ఫాం CSpaceను కేరళ ప్రభుత్వం లాంఛ్ చేసింది. కైరాలీ థియేటర్లో జరిగిన ఈవెంట్లో CSpace యాప్‌ను కేరళ సీఎం పినరయ్ విజయన్ లాంఛ్ చేశారు.
మలయాళం సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేయడంలో భాగంగా కేరళ స్టేట్ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSFDC) ఈ యాప్‌ను రూపొందించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ ఈ యాప్‌ను నిర్వహించనుంది. ప్రస్తుతం సీస్పేస్‌లో 42 సినిమాలు, 35 ఫీచర్ ఫిలిమ్స్, 6 డాక్యుమెంటరీలు, 1 షార్ట్ ఫిలిం అందుబాటులో ఉన్నాయి. ముగ్గురు నిపుణులతో కూడిన ప్యానెల్ పరిశీలన అనంతరం ఈ సినిమాలను ఎంపిక చేసినట్టు సమాచారం.
CSpace పే పర్ వ్యూ మోడల్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకేంటి మరి డిఫరెంట్ కంటెంట్‌ను ఇష్టపడే మూవీ లవర్స్ ఓ సారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసేయండి. సీస్పేస్ యాప్‌ను ఆండ్రాయి, ఐవోఎస్ డివైస్‌లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ప్రైవేట్ యాప్‌లకు ధీటుగా CSpace ఏ స్థాయిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తునేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

