రామ్ అగ్నివేష్, రాజీవ్‌కనకాల, రీతు, రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇక్షు’. బుషిక దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో చిత్రం విడుదల కానుంది. దర్శకురాలు మాట్లాడుతూ ‘ఇటీవల ఐదుభాషల్లో విడుదల చేసిన ప్రచార వీడియోకు మంచి స్పందన వచ్చింది. నేటి యువతరానికి నచ్చే నవ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రామ్ అగ్నివేష్ నటన అలరించే విధంగా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుజిత్‌కుమార్ గుత్తుల.