Allu Sneha Reddy | ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) అందరికీ సుపరిచితమే. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన విశేషాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ పంచుకుంటూ ఉంటారు. ఇక ఆమె ఫిట్నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం యోగా, జిమ్ చేస్తూ స్టార్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసుపోకుండా ఎంతో అందంగా, స్లిమ్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా తన ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేసింది ఈ అల్లువారి కోడలు. తన ఇంటి గార్డెన్లో ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద వర్కౌట్స్ (Morning Workouts ) చేస్తున్న వీడియోను శుక్రవారం నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. స్నేహారెడ్డిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Jamnagar | అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. జామ్‌నగర్‌లో ప్రముఖుల సందడి