ముంబై: సంచలనం సృష్టించిన క్రూజ్ షిప్ రేవ్ పార్టీ( Rave Party )లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న విషయం తెలుసు కదా. ఎన్సీబీ దాడులు జరిపిన సమయంలో ఆర్యన్ ఖాన్ ఆ షిప్‌లోనే ఉన్నాడు. ఎన్సీబీ అతన్ని వీడియో కూడా తీసింది. ఈ పార్టీకి సంబంధించి 10 మందిని అరెస్ట్ చేయగా.. ఆర్యన్‌ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె కూడా ఆర్యన్‌ను ప్రశ్నించినట్లు ధృవీకరించారు. తననో అతిథిగా పిలిస్తే వెళ్లానని విచారణలో ఆర్యన్ చెప్పాడు. ఇప్పటికే ఆర్యన్ ఫోన్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. అంతేకాదు ఢిల్లీ నుంచి ఈ రేవ్ పార్టీలో పాల్గొనడానికి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ప్రముఖ వ్యాపారవేత్తల కూతుళ్లేనని తేలింది.