Hyy Chikitha | ‘హే చికీతా’ రివ్యూ.. రైతుల గొప్పదనాన్ని చాటి చెప్పిన గ్రామీణ డ్రామా!
Hyy Chikitha | అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ పతాకాలపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, 'గరుడవేగ' అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'హే చికీతా'. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామా ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం.
Hyy Chikitha | అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ పతాకాలపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామా ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం.
కథాంశం:
ఈ కథ నాగనూరు, లచ్చక్క పేట గ్రామాల మధ్య సాగుతుంది. శివ (అభినవ్ మణికంఠ) ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ, తన స్నేహితులైన సాయి, సూరి, రాజు, కృష్ణలతో కలిసి సరదాగా కాలం గడుపుతుంటాడు. శివకి కోపం కాస్త ఎక్కువ. అతని మరదళ్లు చిట్టి (దివిజ), పొట్టి (తన్మయ్ ఖుషి) ఇద్దరూ బావను ప్రాణంగా ప్రేమిస్తుంటారు. శివ, చిట్టి చిన్నతనం నుంచే ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం ఉన్నవాడికే తన కూతురిని ఇస్తానని చిట్టి తండ్రి భీష్మించుకు కూర్చుంటాడు. చదువు సరిగ్గా అబ్బని శివ ఎంత ప్రయత్నించినా డిగ్రీ పాస్ కాలేకపోతాడు. ఈ క్రమంలో ఊరిలో జరిగే ఒక గొడవ శివ జీవితాన్ని, అతని ప్రేమను ఎలా మలుపు తిప్పింది? వ్యవసాయం చేసే వాడికి పిల్లను ఇవ్వనన్న మామ మనసును శివ ఎలా మార్చాడు? రైతు గొప్పదనాన్ని చాటుతూ ఈ ప్రేమ జంట చివరకు ఎలా ఒకటైంది? అనేదే ‘హే చికీతా’ ముఖ్య కథాంశం.
నటీనటులు
శివ అలియాస్ బిపి పాత్రలో అభినవ్ మణికంఠ పక్కింటి కుర్రాడిలా చాలా సహజంగా నటించి మెప్పించారు. బావపై అమితమైన ప్రేమను కురిపించే మరదళ్ల పాత్రల్లో దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి పోటీపడి నటించారు. దివిజ తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకోగా, తన్మయ్ నటన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. ఇక రాజన్న పాత్రలో దేవి ప్రసాద్ మరోసారి తన అనుభవాన్ని చాటుకున్నారు. కల్లు మామ పాత్ర అప్పుడప్పుడు నవ్విస్తూనే, క్లైమాక్స్‌లో కథకు కీలక మలుపుగా మారుతుంది. హీరో స్నేహితులుగా నటించిన నటీనటులు తమ కామెడీతో మంచి ఉపశమనాన్ని అందించారు. మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం & విశ్లేషణ
ఒక చక్కటి వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీకి ‘రైతే రాజు’ అనే బలమైన సామాజిక సందేశాన్ని జోడించి దర్శకుడు ధనరాజ్ లెక్కల ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కుటుంబసమేతంగా కలిసి చూసేలా సినిమాను రూపుదిద్దడంలో ఆయన సఫలమయ్యారు. ‘గరుడవేగ’ అంజి అందించిన ఛాయాగ్రహణం పల్లెటూరి వాతావరణాన్ని, నైసర్గిక అందాలను ఎంతో నేచురల్‌గా కెమెరాలో బంధించింది. ఇక చరణ్ అర్జున్ స్వరపరిచిన పాటలు ఎంతో ఫీల్ఫుల్గా ఆకట్టుకోవడమే కాకుండా, ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని భావోద్వేగాలను, తీవ్రతను చక్కగా ఎలివేట్ చేసింది. నిర్మాతలు ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ప్లస్ పాయింట్స్:
సహజమైన నటన మరియు పల్లెటూరి నేపథ్యం
క్లైమాక్స్ మరియు రైతుల ప్రాముఖ్యతను తెలిపే సంభాషణలు
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
మైనస్ పాయింట్స్:
ప్రథమార్థంలో అక్కడక్కడా నెమ్మదించిన కథన శైలి
ముగింపు:
యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి అవసరమైన మంచి సందేశాన్ని అందించిన ‘హే చికీతా’ ఒక మంచి వింటేజ్ విలేజ్ డ్రామా. పల్లె వాతావరణం, బావా-మరదళ్ల ప్రేమ కథలు, రైతుల గొప్పదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం.
రేటింగ్ : 2.75/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

