అర్ధరాత్రి ఐస్‌క్రీం తింటూ హల్చల్
సెలబ్రిటీలను చూసినప్పుడు.. ‘వీళ్లకేం.. అద్భుతమైన జీవితం’ అనుకుంటాం. కానీ వాళ్ల బాధలు వాళ్లకుంటాయి. ఓ విధంగా ప్రశాంతత, స్వేచ్ఛ లేని జీవితం వాళ్లది. అందుకే అప్పుడప్పుడు సామాన్యులుగా బతకడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. హెల్మెట్ పెట్టేసుకొని టూవీలర్‌పై తిరిగేయడం..
సెలబ్రిటీలను చూసినప్పుడు.. ‘వీళ్లకేం.. అద్భుతమైన జీవితం’ అనుకుంటాం. కానీ వాళ్ల బాధలు వాళ్లకుంటాయి. ఓ విధంగా ప్రశాంతత, స్వేచ్ఛ లేని జీవితం వాళ్లది. అందుకే అప్పుడప్పుడు సామాన్యులుగా బతకడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. హెల్మెట్ పెట్టేసుకొని టూవీలర్‌పై తిరిగేయడం.. బురఖా ధరించి షాపింగులు చేసేయడం.. ఇక్కడ ఫ్రీడమ్ దొరక్క పక్క దేశాలకెళ్లి రోడ్లమీద షికార్లు కొట్టేయడం.. ఇలా అన్నమాట. తాజాగా మన లేడీసూపర్‌స్టార్ నయనతార.. ఓ అర్ధరాత్రి తన కజిన్స్‌తో కలిసి చెన్నయ్ వీధుల్లో షికార్లు చేసింది. ఓ ఐస్‌క్రీం పార్లర్ దగ్గర నిలబడి ఐస్‌క్రీం లాగించేస్తూ హల్చల్ చేసింది. ఈ తతంగాన్నంతా తన భర్త విఘ్నేష్ వీడియో తీశాడు. విఘ్నేష్ స్వతహాగా దర్శకుడు కావడం చేత ఆ వీడియోలో క్రియేటివిటీని చొప్పించాడు. నయన్ ఐస్‌క్రీమ్ తింటున్న పార్లర్ ఎదురుగా ఏదో పెద్ద షాప్ ఉంది.
ఆ షాప్ బ్రాండ్ అంబాసిడర్ నయనతారే కావడంతో ఆ షాప్ పైన నయన్‌ది పెద్ద ఫ్లెక్సీ ఉంది. ముందు వీడియోలో ఆ ఫ్లెక్సీని చూపించాడు విఘ్నేష్. తర్వాత కెమెరాను అలా.. పాస్ చేసి, నయనతార కజిన్స్‌ని చూపించాడు. వాళ్లు ఆ ఫ్లెక్సీ వైపు చూస్తూ.. అలా పక్కకు తిరిగారు. వాళ్ల పాయింట్ ఆఫ్‌వ్యూలో ఐస్‌క్రీం తింటున్న నయనతార ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆమెను చూసిన ఆనందంతో ‘మేడమ్..’ అంటూ వాళ్లు ఆనందోత్సాహంతో చూస్తుంటే, నయనతార నవ్వుతూ వాళ్లమీద ఐస్‌క్రీమ్ విసరబోయింది. చూడటానికి క్యూట్‌గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. లేడీ సూపర్‌స్టార్ కదా. ఆ మాత్రం వైరల్ అవ్వడం కామనే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

