RC15 | రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ కోసం శంకర్ భారీ ప్లాన్.. కేవలం సెట్ కోసం అన్ని కోట్లా?
RC15 Sets In Ramoji Film city | రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తండ్రికి తగ్గ తనయుడంటూ బాలీవుడ్ ప్రముఖులు చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ప్రస్తుతం ఈయన సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘#RC15’ చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ కోసం శంకర్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం రామోజీఫిలిం సిటీలో దాదాపు 10కోట్లతో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ సెట్లో చరణ్ ఎంట్రీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇటీవలే చరణ్ స్టైలిష్ లుక్ వీడియో విడుదలైన వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి వార్త సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

