My baby Movie | మై బేబికి భారీ డిమాండ్: హాట్‌కేక్‌ల్లా అమ్ముడైన పంపిణీ హక్కులు
My baby Movie | ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
My baby Movie | ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో ఈనెల జూలై 18న 350కి పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడయినట్లు చిత్రబృందం తెలిపింది.
నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించారు. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి, ‘మై బేబి’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
మరోవైపు ‘మై బేబి’ చిత్రం పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. నైజాంలో గ్లోబల్ సినిమాస్-ఏషియన్ సునీల్, వైజాగ్‌లో గాయత్రిదేవి ఫిలిమ్స్- సతీష్, ఈస్ట్ గోదావరిలో ఆదిత్య సినిమాస్-హెచ్. నాగి సత్యనారాయణ, వెస్ట్ గోదావరి & నెల్లూరు జిల్లాల్లో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్-శ్రీనివాసరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గురు రాఘవేంద్ర ఫిలిమ్స్-శోభన్, మరియు చిత్తూరు, కడప జిల్లాల్లో ధనలక్ష్మి ఫిలిమ్స్-డి. సుభాష్ చంద్ర నాయుడు ఈ హక్కులను దక్కించుకున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ‘మై బేబి’ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను పొందింది. వైబోధ ఘిబ్రాన్ అందించిన సంగీతం, ఆధునిక సంబంధాలు, భావోద్వేగాలను చక్కగా చిత్రీకరించిన విధానంపై సమీక్షకులు ప్రశంసలు కురిపించారు. తమిళంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం, తెలుగులో కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని నిర్మాత సురేష్ కొండేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతను ఆకర్షించే కథాంశంతో, సమాజంలోని సున్నితమైన అంశాలను చర్చించేలా ఈ సినిమా రూపొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

