సాంకేతిక సంచలనం వార్ 2
సాంకేతికత ఏ స్థాయికి చేరిందంటే.. హీరోలు లేకుండానే హీరోలకు సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. ఒకట్రెండు సీన్స్ కాదు.. ఏకంగా షెడ్యూల్సే చేస్తున్నారు. ప్రస్తుతం యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ‘వార్-2’.
సాంకేతికత ఏ స్థాయికి చేరిందంటే.. హీరోలు లేకుండానే హీరోలకు సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. ఒకట్రెండు సీన్స్ కాదు.. ఏకంగా షెడ్యూల్సే చేస్తున్నారు. ప్రస్తుతం యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ‘వార్-2’. ఇందులో హృతిక్‌రోషన్, ఎన్టీయార్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే హృతిక్ షూటింగ్లో అడుగుపెట్టారు. షూటింగ్ మొత్తం స్టూడియోలోనే గ్రీన్మ్యాట్లో తీస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ.
ఏప్రిల్ నుంచి మే చివరి వరకు తారక్‌పై సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది. విశేషమేంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన రెండు భారీ ఓవర్సీస్ షెడ్యూళ్లను లీడ్ యాక్టర్స్ లేకుండానే బాడీ డబుల్స్‌తో ఇప్పటికే పూర్తి చేశారట దర్శకుడు అయాన్ ముఖర్జీ. బాడీ డబుల్స్‌తో చిత్రీకరించిన ఆ సన్నివేశాలకు అధునాతన వీఎఫ్ఎక్స్ సాంకేతికతను ఉపయోగించి ముఖాలను మార్చేయడం జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం. పెద్దగా హీరోలకు శ్రమ నివ్వకుండా, వారి బ్రాండ్ ఇమేజ్‌ని మాత్రమే వాడుకుంటూ టెక్నాలజీతో సినిమాను పూర్తి చేయడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. యష్‌రాజ్ ఫిల్మ్స్ వారు కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 8 నెలలు సమయం కేటాయించినట్టు విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

