S.S.Rajamouli | రాజమౌళి టేకింగ్‌పై స్పీల్బర్గ్ ప్రశంసలు.. డ్యాన్స్ చేయాలనిపిస్తుందంటూ జక్కన్న ఆనందం..!
హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టివెన్ స్పిల్ బర్గ్ రాజమౌళిపై ప్రశంసలు కురపించాడు. 'ఆర్ఆర్ఆర్' మూవీ అవుట్ స్టాండింగ్ అంటూ చిత్రయూనిట్‌ను మెచ్చుకున్నాడు. ఇది జక్కన్నకు ఊహించని పరిణామం.
S.S.Rajamouli-Steven spielberg Online Chat | హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టివెన్ స్పీల్బర్గ్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అవుట్ స్టాండింగ్ అంటూ చిత్రయూనిట్‌ను మెచ్చుకున్నాడు. ఇది జక్కన్నకు ఊహించని పరిణామం. అంతేకాదు స్పిల్బర్గ్తో ఆన్లైన్లో మాట్లాడటం రాజమౌళిని ఆనందంలో ముంచెస్తుంది. కాగా స్పిల్బర్గ్ దర్శకత్వం వహించిన ది ఫెబుల్ మ్యాన్ ఇండియాలో శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఇద్ధరు దర్శకులు ఆన్లైన్లో ముచ్చటించారు.
స్పీల్బర్గ్, రాజమౌళి ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత సినీ జివితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తనను బాగా ఆకట్టుకుందని, సినిమా చూస్తన్నంతసేపు తన కళ్లను నమ్మలేకపోయానని స్పీల్బర్గ్ అన్నారు. అంతేకాకుండా రాజమౌళి టేకింగ్, విజన్ అత్యద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు. దానికి రాజమౌళి.. స్పీల్‌బర్గ్‌కు ధన్యవాదాలు చెబుతూ మీరు మా చిత్రాన్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉందని, మీరిచ్చిన ప్రశంసకు ఇప్పుడే కుర్చిలో నుంచి లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుందని ఉప్పొంగిపోయాడు. ఇలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ మన తెలుగు సినిమా గురించి వర్ణించడం మనకెంతో గర్వకారణం.
ఇక ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘నాటు నాటు’ పాటను వరించింది. దీంతో పాటుగా క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్(నాటు నాటు) అవార్డులను కూడా గెలుచుకుంది. ఇదే పాట ఇప్పుడు ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో ఉండటంతో ఇక ఖ్యాతి మరింతగా పెరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

