Chuck Norris : ప్రముఖ హాలీవుడ్ నటుడు చుక్ నోరిస్ (Chuck Norris) కన్నుమూశారు. మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్‌మాస్టర్, యాక్షన్ స్టార్‌గా అభిమానులను అలరించిన నోరిస్ 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. వాకర్, టెక్సాస్ రేంజ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన అకస్మాత్తుగా మరణించారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
టీవీ నటుడిగా, సినిమా స్టార్‌గా హాలీవుడ్ ఫ్యాన్స్‌కు సుపరిచితమైన చుక్ నోరిస్ ఇకలేరు. అమెరికాలో నటుడిగా తనకంటూ విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఇటీవలే 86వ పుట్టిన రోజును ఘనంగా చేసుకున్న ఆయన ఈ మధ్య అత్యవసరంగా ఆస్పత్రిలో చేరారు. హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్ అయిన నోరిస్ హఠాత్తుగా గురువారం మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
BREAKING: Martial arts icon and screen legend Chuck Norris passes away at 86, leaving behind a legacy of discipline and devotion. | @AmericaNewsroom
“He lived his life with faith, purpose, and an unwavering commitment to the people he loved. Through his work, discipline, and… pic.twitter.com/tSpsFSEFpY
— Fox News (@FoxNews) March 20, 2026
‘చుక్ నోరిస్ హఠాత్తుగా మమ్మల్ని విడిచివెళ్లారు. ఈ విషాద సమయం, పరిస్థితులను మేము రహస్యంగా ఉంచాలని భావిస్తున్నాం. కుటుంబసభ్యులం అందరం నోరిస్ చుట్టూ ఉన్నాం. ఆయన ప్రశాంతంగా ఉన్నారు’ అని నటుడి కుటుంబం సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
Actor Chuck Norris, the action hero and star of “Walker, Texas Ranger,” has died, according to a post on his verified Instagram account. He was 86. https://t.co/61iYjfN4AQ pic.twitter.com/7LxYN3MbTh
— CNN (@CNN) March 20, 2026
అమెరికాలోని ఒక్లహోమలోని రియాన్లో 1940 మార్చి 10వ తేదిన చుక్ నోరిస్ జన్మించారు. చిన్నతనంలో పేదరికం అనుభవించిన ఆయనకు పన్నెండేళ్లప్పుడు కుటంబమంతా క్యాలీఫోర్నియాలోని టొర్రాన్స్కు వలస వెళ్లింది. అక్కడ స్కూల్ చదువు పూర్తయ్యాక యూఎస్ వాయుసేనలో నోరిస్ చేరారు. విధుల్లో భాగంగా కొరియాకు వెళ్లినప్పుడు ఆయన మార్షల్ ఆర్ట్స్, జుడో, టాంగ్ సూ డూ వంటి వాటిలో శిక్షణ పొందారు.
అమెరికా వాయుసేనలో పనిచేసిన చుక్ నోరిస్ టీవీ, సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్‌లో రారాజుగా వెలుగొందారు. మిడిల్ వెయిట్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా ఆరుసార్లు విజేతగా నిలిచారు. అంతేకాదు సొంతంగా కొరియా మూలాలున్న అమెరికా హార్డ్ స్టయిల్ కరాటేకు రూపమిచ్చారు. చున్ కుక్ డో, ది యునైటెడ్ ఫైటింగ్ ఆర్ట్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన నోరిస్.. ప్రపంచవ్యాప్తంగా 3,300 మందికి బ్లాక్ బెల్ట్స్ అందించారు. దాంతో, ఈ మార్షల్ ఆర్ట్స్ వీరుడిని బ్లాక్ బెల్ట్ మ్యాగజైన్ హాల్ ఫామ్ ఫేమ్ గౌరవం కల్పించింది. టెన్త్ డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను ప్రదానం చేసింది.