భయపెడుతూ థ్రిల్‌ను పంచుతుంది
‘నా ఫేవరేట్ హీరో నాని. ‘గూఢచారి’ ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఆయన నిర్మాణంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది.
‘నా ఫేవరేట్ హీరో నాని. ‘గూఢచారి’ ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఆయన నిర్మాణంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ‘హిట్’ తొలిభాగం ప్రశ్నల్ని సంధిస్తూ థ్రిల్ చేస్తే, ఈ రెండో భాగం భయపెడుతూ థ్రిల్‌ను పంచుతుంది. దర్శకుడు నన్ను కొత్తగా ప్రజెంట్ చేశాడు’ అన్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్-2’. ‘ది సెకండ్ కేస్’ ఉపశీర్షిక. శైలేష్ కొలను దర్శకుడు. డిసెంబర్ 2న విడుదలకానుంది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘అడివి శేష్ అంకితభావంతో పనిచేస్తాడు.
ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ‘హిట్’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మరింత పట్టుదలగా రెండో భాగాన్ని తెరకెక్కించాం’ అని దర్శకుడు తెలిపారు. కొత్త పంథాలో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ఇదని నిర్మాత ప్రశాంతి త్రిపిరనేని పేర్కొంది. కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘తెలుగులో నాకిది మూడో చిత్రం. మంచి టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adivi sesh
- hit 2
- Nani
- Shailesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

