చక్కని కథలను, మంచి పాత్రలను ఎంచుకుంటూ ప్రతీ సినిమాకు గ్రాఫ్‌ని పెంచుకుంటూ ముందుకు పోతున్నారు నాని. ఆయన తాజా సినిమా పేరు ‘హాయ్ నాన్న’. కథ, కథనాలు భావోద్వేగపూరితంగా ఉంటాయని ఈ టైటిల్ చెప్పకనే చెబుతున్నది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. మృణాల్ ఠాకూర్ కథానాయిక. నాని కూతురిగా బేబీ కియారా ఖన్నా నటిస్తున్నది. కేరళలోని కూనూర్ పచ్చని అందాల నడుమ ఈ సినిమా నూతన షెడ్యూల్ మొదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజికల్ ఫెస్ట్ త్వరలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాణం: వైరా ఎంటర్టైన్మెంట్స్.