Aadikeshava | వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుంచి హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్
Aadikeshava | టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ఆదికేశవ (Aadikeshava). ఈ మూవీ నుంచి హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్. అందమైన లొకేషన్లలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
Aadikeshava | టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ఆదికేశవ (Aadikeshava). PVT 4గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ నుంచి హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్. అందమైన లొకేషన్లలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజిషన్‌లో అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల పాడారు. అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటుండగా.. వైష్ణవ్ తేజ్ ఆ రౌడీల అంతు చూసే యాక్షన్ సన్నివేశాలతో సాగే గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. వైష్ణవ్ తేజ్ ఈ సారి పక్కా యాక్షన్ మాస్ అవతార్‌లో అదరగొట్టబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఆదికేశవలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా..బీస్ట్ ఫేం అపర్ణా దాస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్..
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

