‘యాక్షన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘ది ఘోస్ట్’తో నా కల నెరవేరింది. ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపిస్తా’ అని చెప్పింది సోనాల్ చౌహాన్. ఆమె నాగార్జున సరసన కథానాయికగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ ‘దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఏకే 47వంటి ఆయుధాల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నా. ఇది నా డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం శారీరకంగా చాలా శ్రమించాను. నాగార్జున నా అభిమాన హీరో. ఆయనతో పనిచేయాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది. నాగార్జునతో మంచి రొమాంటిక్ సినిమా చేయాలనుంది (నవ్వుతూ). ప్రతీ విషయాన్ని ఇండస్ట్రీలోనే నేర్చుకున్నా. సినిమాలపరంగా జయాపజయాల్ని స మంగా స్వీకరిస్తాను’ అని చెప్పింది.