Family Star | ఫ్యామిలీస్టార్ సందడి షురూ?
Vijay Devarakonda | కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తూ వుంటాయి. అలాంటి సినిమానే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్'. ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి కారణం ‘గీతగోవిందం’ సినిమానే అని చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కించిన ఆ సినిమా అప్పటివరకూ దేవరకొండపై ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది.
Family Star | కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తూ వుంటాయి. అలాంటి సినిమానే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’. ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి కారణం ‘గీతగోవిందం’ సినిమానే అని చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కించిన ఆ సినిమా అప్పటివరకూ దేవరకొండపై ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. ఓ కొత్త విజయ్‌ని తెరపై ఆవిష్కరించింది. దేవరకొండ విజయ్ కెరీర్లో తొలి వందకోట్ల సినిమాగా నిలిచింది ‘గీతగోవిందం’.
ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉండటం కామనే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు సంకల్పించిన విషయం విదితమే. అందుకే షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేసేపనిలో ఉన్నారు దర్శకుడు పరశురామ్ . విడుదలకు ఇంకా అయిదు వారాలే సమయం ఉండటంతో ప్రమోషన్స్ కూడా వెరైటీగా ప్లాన్ చేశారట దిల్ రాజు. ఓ వైపు ప్రమోషన్ పనులూ, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు.. అన్నీ సిస్టమేటిగ్గా జరిగేలా ప్లాన్ చేశారట దిల్‌రాజు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ తరహాలోనే సున్నితమైన పాయింట్‌తో.. వినోదంతో కూడిన ప్రేమకథగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారట పరశురామ్. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కట్టిపడేస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.యూ.మోహనన్, సంగీతం: గోపీసుందర్, రచన-దర్శకత్వం: పరశురామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

