శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, శివరామరాజు వంటి హిట్ చిత్రాల్లో అలరించారు హీరో వెంకట్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
‘మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలుంటాయి. హీరో వెంకట్‌కు తెలుగులో కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది’ అని మేకర్స్ అన్నారు. హెబ్బాపటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మని జీన్న, నిర్మాణ సంస్థ: వీఆర్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: లక్ష్మణ్‌రావు, ప్రవీణ్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ తాళ్లూరి.