వెంకీ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’
హీరో వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమాకు ‘సైంధవ్' అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు.
హీరో వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తున్నది. బుధవారం ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా టైటిల్‌తో పాటు వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో చంద్రప్రస్థ అనే పోర్ట్ సిటీలో వెంకటేష్ కొందరు విలన్లతో పోరాడే సీన్ చూపించారు.
‘నేను ఇక్కడే ఉంటాను..ఎక్కడికి వెళ్లను.. రమ్మను’ అంటూ ఓ పవర్ఫుల్ డైలాగ్‌తో గ్లింప్స్ ఆకట్టుకుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతున్నది. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం : సంతోష్ నారాయణ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

