Hero Nani! నమ్మకం నిజమైంది
‘కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వినూత్న కథాంశాలతో సినిమాలు తీయాలనే లక్ష్యంతో ‘వాల్‌పోస్టర్' సినిమా బ్యానర్ మొదలుపెట్టా.
‘కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వినూత్న కథాంశాలతో సినిమాలు తీయాలనే లక్ష్యంతో ‘వాల్‌పోస్టర్’ సినిమా బ్యానర్ మొదలుపెట్టా. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించిన కొత్తలో కొందరు నన్ను భయపెట్టారు. ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలు ఎవరు చూస్తారు? ఇవన్నీ వర్కవుట్ కావని చెప్పేవారు. అయితే కథల విషయంలో తెలుగు ప్రేక్షకుల జడ్జిమెంట్‌పై నమ్మకంతో ముందుకెళ్లా’ అని చెప్పారు హీరో నాని. ఆయన సమర్పకుడిగా వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘హిట్-2’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ ‘చక్కటి కథాబలం ఉన్న చిత్రాల్ని తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ఇదే ఉత్సాహంతో మరిన్ని మంచి చిత్రాల్ని అందించే ప్రయత్నాలు చేస్తా’ అన్నారు. సినిమాకు విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నదని హీరో అడివి శేష్, దర్శకులు శైలేష్ కొలను ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

