Nani30 Movie | మళ్లీ చిరంజీవి సినిమా టైటిల్‌ను కొట్టేసిన నాని?
Nani Next Movie Title | రిజల్ట్ సంగతి పక్కన పెడితే నాని ఒకే జానర్‌కు కట్టిబడి ఉండకుండా.. ప్రతీ సినిమాకు వేరియేషన్ చూపిస్తుంటాడు. గత ఐదారేళ్ల నుంచి నాని సినిమాలు గమనిస్తే కమర్షియల్‌గా పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టలేవేమో కానీ.. కథల ఎంపికలో మాత్రం నాని సక్సెస్ అయ్యాడు.
Nani Next Movie Title | రిజల్ట్ సంగతి పక్కన పెడితే నాని ఒకే జానర్‌కు కట్టిబడి ఉండకుండా.. ప్రతీ సినిమాకు వేరియేషన్ చూపిస్తుంటాడు. గత ఐదారేళ్ల నుంచి నాని సినిమాలు గమనిస్తే కమర్షియల్‌గా పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టలేవేమో కానీ.. కథల ఎంపికలో మాత్రం నాని సక్సెస్ అయ్యాడు. ఇక ఈ ఏడాది దసరాతో నాని మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌తో ఓ క్లాస్ సినిమాతో రెడీ అయిపోతున్నాడు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న నాని30 సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా చూస్తుంటే ఇది ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో సాగుతుందని స్పష్టమయిపోయింది. ఇక ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్సయిపోయిందని సమాచారం. ఈ సినిమాకు హలో డాడీ అనే టైటిల్‌ను ఫిక్సయినట్లు తెలుస్తుంది. గతంలో చిరు డాడీ అనే సినిమా కూడా ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో వచ్చి బంపర్ హిట్టయింది. ఇక ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లు హలో డాడీ అనే టైటిల్‌తో మేకర్స్ వస్తున్నారట. హాయ్ డాడీ, హలో నాన్న వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికి హలో డాడీ పేరునే దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నట్లు టాక్. నాలుగేళ్ల క్రితం విక్రమ్ కుమార్‌తో తీసిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా టైటిలే.
ఎమోషనల్ జర్నీగా సాగే నాని30 సినిమాలో నానికి జోడీగా సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ నటిస్తుంది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అనే పాప నటిస్తుంది. ఈ సినిమా గుండెకు హత్తుకునే సీన్లు ఉన్నాయని, మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాను వైరా మూవీస్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. మలయాళ సంగీత విద్వాంసుడు హేషమ్ అబ్దుల్ వాహద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈసినిమా టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

