Harish Shankar | పవన్ కల్యాణ్, హరీష్ శంకర్.. ఈ కాంబినేషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. పవన్ కల్యాణ్‌కు గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసిందీ మూవీ. ఇక ఈ ఇద్దరి కాంబోలో లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సారి కూడా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా.. బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని ఫిక్సయిన మూవీ లవర్స్‌కు ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా రిలీజైన తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరైతే ఫెయిల్యూర్ అంటూ కామెంట్స్ పెట్టారు.
అయితే వీటిపై హరీష్ శంకర్ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తిరువీర్ నటిస్తోన్న పాపం ప్రతాప్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌కు హరీష్ శంకర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘నేను స్టేజ్‌పైకి రాగానే యాంకర్ పాపం హరీష్ శంకర్ అని మాట్లాడింది. ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలు అందుకోలేకపోవడం వల్లే ఆమె అలా అన్నదని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత యాంకర్ ఇదే విషయాన్ని అందరితో చేసింది. ఇది సినిమా టైటిల్(పాపం ప్రతాప్)కు సింక్ చేస్తూ చేసిన ప్రమోషనల్ స్ట్రాటజీ అని కేవలం అప్పుడే నేను రియలైజ్ అయ్యానంటూ’ చెప్పుకొచ్చాడు.
హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయిందని ఒప్పుకున్నాడని చెప్పకనే చెబుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయని నిజాయితీగా ఒప్పుకున్న హరీష్ శంకర్ మరింత బలమైన కథ, కథనంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని విష్ చేస్తున్నారు మూవీ లవర్స్.
Director #Harishshankar about his last movie result #ustaadbagathsingh pic.twitter.com/BLmOWhevu1
— Sreenivas Gandla (@SreenivasPRO) April 11, 2026