డెలివరీ టైంలో తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేసిన హరితేజ

బుల్లితెరతో పాటు వెండితెరపై వైవిధ్యమైన వినోదాన్ని అందించిన హరితేజ ఏప్రిల్ 5న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తను గర్భవతిగా ఉన్నప్పటి నుండి పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చిన హరితేజ ఇటీవల తమ యానివర్సరీ సందర్భంగా కూతురితో దిగిన ఫొటోని షేర్ చేసింది.ఇక తాజాగా ప్రస్తుత పరిస్థితులని చూసి తాను డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడిందో వీడియో ద్వారా వివరించింది.
పాప పుట్టిందని అందరు విష్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఆ సమయంలో నేను రిప్లై ఇచ్చే పరిస్థితిలో లేను. ఏం జరిగిందో మీకు తెలియజేస్తాను. తొమ్మిదో నెలలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. మంచి ఫుడ్ తీసుకుంటూ యోగసనాలు చేశారు. అయితే వారంలో నా డెలివరీ. ఆ సమయంలో మా ఇంట్లో అందరికి కరోనా పాజిటివ్. నాకు వచ్చింది. ఆ సమయంలో నా మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయోలో అర్ధం కాలేదు. వచ్చినప్పుడు చూసుకుందాములే అని అందరు అనుకున్నట్టు నేను అనుకున్నా, కాని చాలా బాధపడ్డాము. కరోనా పాజిటివ్ కాబట్టి డెలివరీ చేయలేము అన్నారు. కోవిడ్ ఆసుపత్రికి వెళ్లమన్నారు.
బేబి కోసం చాలా టెస్ట్లు చేశారు. నిద్ర లేని రాత్రులు గడిపాను. తప్పని సరిగా ఆపరేషన్ చేయాలని అన్నారు. నా డెలివరీ సమయంలో నేను నా భర్త మాత్రమే ఉన్నాం. ధైర్యం చెప్పేవాళ్లు లేరు. నా బేబికి నెగెటివ్ రావడంతో వెంటనే నా దగ్గర నుండి తీసుకెళ్లి పోయారు. వీడియా కాల్లో చూశాను. ఇంటికి వచ్చాక కూడా అందరం ఐసోలేషన్లో ఉన్నాం. సాయం అడగలేని పరిస్థితి. నా భర్త, ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారు . ఏదేమైన మనకు రాదు అని అజాగ్రత్త వద్దు. వచ్చిన తర్వాత బాధపడడం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగినా కూడా అధైర్య పడొద్దు. సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుందని తెలిసింది. దేవుడి దయతో మా ఇంట్లో అందరం క్షేమంగా బయటపడ్డాం.. అందరికీ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మీతో పంచుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పుకున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యింది హరితేజ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

