Rashmika Mandanna | నేడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’ (Ranabaali) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే మైసా నుంచి కొత్త పోస్టర్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుండగా.. తాజాగా రణబాలి సినిమాలో రష్మిక పోషిస్తున్న ‘జయమ్మ’ పాత్రకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్ను విడుదల చేసింది. ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషెస్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్ నడుస్తుంది. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి విభిన్నమైన చిత్రాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్.. ఈసారి ‘రణబాలి’తో ఒక పవర్ఫుల్ పిరియాడిక్ కథను వెండితెరపై చూపించబోతున్నాడు.