Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ప్రకటించారని తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా గుంటూరు కారం తమిళ రైట్స్ కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళనాడులో పాపులర్ బ్యానర్ శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేయనుంది.
ఇటీవలే గుంటూరు కారం నుంచి శ్రీలీల, మహేశ్ బాబు కాంబోలో ఫ్లోర్‌పై మంటలు పుట్టించే వచ్చే హై ఓల్టేజ్ స్పైసీ హాట్ మాస్ సాంగ్ లుక్ విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. గుంటూరు కారం నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలు నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి.
గుంటూరు కారంను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
#GunturKaaram TN theatrical release by Sri Lakshmi Movies..
Jan 12th theatrical release. pic.twitter.com/UpxNIiIo0U— Naganathan (@Nn84Naganatha) December 27, 2023
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @meenakshiioffl @vamsi84 @manojdft… pic.twitter.com/UGxRgb7HyH
— sreeleela (@sreeleela14) December 25, 2023
గుంటూరు కారం యాక్షన్ టైం ..
Super🌟 @urstrulyMahesh , director Trivikram, and stunt director Anl Arasu on the #Gunturkaaram sets 🤩🤩#GunturKaaramOnJan12th 🌶️🌶️ pic.twitter.com/MDtV2dyoP0
— Mahesh Babu Space (@SSMBSpace) December 25, 2023
The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..