Neelima Guna | ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహ రిసెప్షన్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు రాజమౌళి, రమా రజామౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నీలిమ గుణ వివాహం వ్యాపారవేత్త రవి ప్రక్యాతో డిసెంబర్ 3వ తేదీ (శనివారం) అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కుటుంబ సభ్యుల సమసక్షంలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నీలిమ గుణ ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Exclusive:
Icon Star @alluarjun at @Gunasekhar1's Daughter @neelima_guna's Reception event #AA #AlluArjun𓃵 pic.twitter.com/8WpZmPVpHX
— Alluprudhvi🪓 (@Alluprudhvi06) December 12, 2022
Exclusive:
Super Star @urstrulyMahesh at @Gunasekhar1's Daughter @neelima_guna's Reception event #SSMB #MaheshBabu pic.twitter.com/0g2hD1omwR
— Rajesh Manne (@rajeshmanne1) December 11, 2022