ఎన్టీఆర్‌పై హాలీవుడ్ దర్శకుడి ప్రశంస
గార్డియన్స్ ఆఫ్ ది గేలాక్సీ’ సిరీస్‌తో ప్రతిభ గల దర్శకుడిగా హాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు జేమ్స్ గన్. తాజాగా ఈ దర్శకుడు తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘
‘గార్డియన్స్ ఆఫ్ ది గేలాక్సీ’ సిరీస్‌తో ప్రతిభ గల దర్శకుడిగా హాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు జేమ్స్ గన్. తాజాగా ఈ దర్శకుడు తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన తనను ఆకట్టుకుందన్న జేమ్స్…ఆయనతో ఓ సినిమాకు ప్లాన్ చేస్తానని తెలిపారు. దర్శకుడు జేమ్స్ గన్ మాట్లాడుతూ…“ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ మధ్యే చూశాను. ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంది. పులితో ఫైట్ సీక్వెన్సులో ఆయన హావభావాలు బాగున్నాయి. ఎన్టీఆర్ కీలక పాత్రలో ఓ సినిమా రూపొందించాలని ఉంది’ అన్నారు. ప్రచార కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లినప్పుడు ఎన్టీఆర్ కూడా మంచి అవకాశం వస్తే హాలీవుడ్లో నటిస్తానని చెప్పారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాల్లో విడుదలైంది. అప్పటి నుంచి విదేశీ సినీ ప్రముఖులను ఆకట్టుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

