Arere Arere | హైదరాబాద్‌లో ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల
Arere Arere | హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా ప్రతిభను చాటుతూ రూపొందిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
Arere Arere | హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా ప్రతిభను చాటుతూ రూపొందిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై నూతన్ చెకూరి నిర్మించిన ఈ ఆల్బమ్ విడుదల కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, యువ హీరో పూరి ఆకాష్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటులు సమీర్, సాగర్, మిమిక్రీ శివారెడ్డి వంటి సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై ఆడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ దియాలోని బహుముఖ ప్రజ్ఞను కొనియాడారు, ఆమె గాత్రం మరియు నటన రెండూ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. రఘు కుంచె మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని, దియా భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో దియాతో కలిసి నటించిన పూరి ఆకాష్ ఆమె గాన ప్రతిభను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, యువ కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మిమిక్రీ శివారెడ్డి, నిర్మాత నూతన్ చెకూరి తదితరులు దియా కృషిని అభినందిస్తూ ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మ్యూజిక్ వీడియో దర్శకుడు క్రాంతి వర్మ, సంగీత దర్శకుడు శరవణ వాసుదేవన్ మాట్లాడుతూ తమ టీమ్ ఎంతో శ్రమించి ఈ ప్రాజెక్ట్‌ను ఒక అందమైన విజువల్ అనుభూతిగా తీర్చిదిద్దారని తెలిపారు. నటి, సింగర్ దియా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకుల ఆదరణే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. క్రాంతి వర్మ దర్శకత్వంలో, కే అండ్ ఎం రైటింగ్స్ కథతో రూపొందిన ఈ ఆల్బమ్‌కు చందు ఏజే సినిమాటోగ్రఫీ అందించగా, త్వరలోనే ఇది యూట్యూబ్, స్పాటిఫై వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

