ఆశ్చర్యపరిచే క్యారెక్టర్లో!
‘ఎఫ్ 3’ సినిమాలో నా పాత్ర ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అని చెబుతున్నది నాయిక సోనాల్ చౌహాన్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కిందని ఆమె అంటున్నది
‘ఎఫ్ 3’ సినిమాలో నా పాత్ర ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అని చెబుతున్నది నాయిక సోనాల్ చౌహాన్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కిందని ఆమె అంటున్నది. దిల్ రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్, తమన్నా నాయికలు. ఈ సినిమా ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్నది.
ఈ సందర్భంగా సినిమాలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక సోనాల్ చౌహాన్. ఆమె మాట్లాడుతూ…‘లెజెండ్ సినిమాలో నేను నటిస్తున్నప్పటి నుంచి దర్శకుడు అనిల్ రావిపూడితో పరిచయం. కామెడీ ఎంటర్టైనర్స్ రూపొందించే ఆయన సినిమాలో నటించాలని ఉండేది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు దర్శకుడు నాకు ఆఫర్ చేశారు. నా పాత్ర ఆశ్చర్యపరిచేలా ఉంటుంది కాబట్టి ట్రైలర్లో కూడా దాన్ని అలాగే రహస్యంగా ఉంచాం. ఒక మంచి మలుపుతో నా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లతో నటించడాన్ని ఎంజాయ్ చేశాను’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amazing
- anil ravipudi
- character
- f3
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

