గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. గతంలో వీరి కలయికలో లక్ష్యం, లౌక్యం చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ కాంబోగా రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న వేసవి సెలవుల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో విక్కీ అనే పవర్ఫుల్ పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఇది. కథకు తగ్గ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కి.జే.మేయర్, కథ: భూపతి రాజా