గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రామబాణం’. డింపుల్ హయతి నాయికగా నటిస్తున్నది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు సామాజిక సందేశమున్న సినిమా ఇదని, రామబాణంలా దూసుకెళ్లే కుర్రాడు విక్కీ పాత్రలో గోపీచంద్ నటన ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతున్నది. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : భూపతి రాజా, సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి, సంగీతం : మిక్కీ జే మేయర్.