Bhimaa Movie | భీమా రివ్యూ: గోపీచంద్ కమర్షియల్ ఫాంటసీ ఆకట్టుకుందా !
Bhimaa Movie | కమర్షియల్ కథలు హీరో గోపీచంద్ కి భలే నప్పుతాయి. అందులోనూ పోలీసు కథలకు సరిగ్గా సరిపోయే హీరో ఆయన. ఇప్పుడు గోపీచంద్ నుంచి కమర్షియల్ అంశాలతో రూపొందిన పోలీస్ కథగా ‘భీమా’(Bhimaa) వచ్చింది. ఇందులో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? భీమాగా గోపీచంద్ పంచిన వినోదాలు గురించి తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
Bhimaa Movie Review | కమర్షియల్ కథలు హీరో గోపీచంద్ కి భలే నప్పుతాయి. అందులోనూ పోలీసు కథలకు సరిగ్గా సరిపోయే హీరో ఆయన. ఇప్పుడు గోపీచంద్ నుంచి కమర్షియల్ అంశాలతో రూపొందిన పోలీస్ కథగా ‘భీమా’(Bhimaa) వచ్చింది. ఇందులో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? భీమాగా గోపీచంద్ పంచిన వినోదాలు గురించి తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ గురించి:
అది కర్ణాటకలోని పరశురామ క్షేత్రం- మహేంద్రగిరి. ఆ ప్రాంతంలో దివ్యఔషధ గుణములుండే మొక్కలు వుంటాయి. అలాగే ఓ మహిమ గల శివాలయం వుంటుంది. చనిపోయిన వారి చివరి కోరిక న్యాయ బద్దమైనదైతే, ఆ శివాలయంలో పూజలు చేస్తే ఆ కోరిక తీరుతుంది. అయితే అనూహ్యంగా ఆ గుడిని మూసివేయాల్సి వస్తుంది. సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత అదే ఊరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు భీమా (గోపీచంద్). తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న రౌడీ భవాని కి ఎలా బుద్ధి చెప్పాడు? ఈ కథలో రవీంద్ర వర్మ( నాజర్) పాత్ర ఏమిటి ? మూతపడిన గుడికి భీమాకి వున్న సంబంధం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.
కథా విశ్లేషణ: ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించిన నిజాయితీగా పోలీస్ కథ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సెమీ ఫాంటసీ టచ్ తో మలిచాడు దర్శకుడు. బాదామి తీరంలోని శివాలయం నేపధ్యంలో కథ ఆసక్తిగా మొదలుపెట్టాడు దర్శకుడు. భీమాగా గోపీచంద్ పరిచయంతో సన్నివేశాలు కమర్షియల్ కొలతలతో హుషారుగా ముందుగుసాగుతాయి. మాళవిక శర్మ పాత్రతో చిన్న లవ్ ట్రాక్ వుంది కానీ అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. విరామం సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో అంచనాలు పెంచుతుంది. భీమా పాత్రలో ఒక ట్విస్ట్ వుంది. అది సెకండ్ హాఫ్ లో ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. ఇందులో అసలు విలన్ ఎవరనేది కూడా అప్పుడే తెలుస్తుంది. హీరో చేసే దుష్ట సంహారానికి ఫాంటసీ ఎలిమెంట్ జోడించడంతో కొత్తదనం వచ్చింది. క్లైమాక్స్ ఆకట్టుకునేలా తీశారు.
నటీనటులు: భీమా పాత్రలో ఎనర్జిటిక్ గా కనిపించారు గోపీచంద్. ఆయన పాత్ర హుషారుగా వుంటుంది. యాక్షన్ సీన్స్ లో తన మార్కు చూపించారు. మాళవిక, ప్రియభవాని అందంగా కనిపించారు. నటన పరంగా ఓకే అనిపిస్తారు. వెన్నెల కిషోర్ పాత్ర కథలో కీలకంగా వుంటుంది. నాజర్ తన అనుభవాన్ని చూపించారు. రఘుబాబు, చమ్మక్ చంద్ర, రచ్చరవి పరిధిమేరకు నవ్వించారు.
టెక్నికల్: రవి బస్రూర్ పాటలు కంటే నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా చేశారు. బీజీఎం కొన్ని సార్లు విజువల్ ని కూడా డామినేట్ చేస్తుంది. స్వామీ జే గౌడ కెమరాపనితనం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అజ్జు మహాకాళి మాటలు పవర్ ఫుల్ గా వున్నాయి. దర్శకుడు ఈ కథని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చెప్పడంతో కొంత ఆసక్తికలిగించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఓ ఫాంటసీ ని జోడించిన ఈ చిత్రం మంచి కాలక్షేపాన్నే ఇస్తుంది.
ప్లస్ పాయింట్స్: గోపీచంద్, కమర్షియల్ ఎలిమెంట్స్, నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ లో కొన్ని రొటీన్ సీన్స్, లవ్ ట్రాక్
రేటింగ్ : 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

