‘రాజకీయంగా అనిశ్చిత పరిస్థితుల్ని సృష్టించి అందలాలు ఎక్కుదామనుకున్న దుష్ట శక్తుల పన్నాగాలకు ఓ గాడ్‌ఫాదర్ అడ్డుకట్టవేస్తాడు. ప్రజల దృష్టిలో సాధారణ వ్యక్తిగా కనిపించే అతని అసాధారణ నేపథ్యమేమిటో తెలుసుకోవాలంటే ‘గాడ్‌ఫాదర్’ చూడాల్సిందే’ అంటున్నారు మోహన్‌రాజా. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’.
నయనతార కథానాయిక. ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్ నిర్మాతలు. దసరా కానుకగా విడుదలకానుంది. ఈ నెల 21న చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. గురువారం చిరంజీవి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ఆయన రఫ్ అండ్ ైస్టెలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. న్యాయం వైపు నిలబడే గాడ్‌ఫాదర్‌గా చిరంజీవి శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. సల్మాన్‌ఖాన్ పాత్ర కీలకంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్‌షా, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా.