పుట్టగానే బ్రహ్మ ముడి పెట్టరో.. వయసు తాకి జంట కట్టెరో..
అనుష్కశెట్టి లీడ్ రోల్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అనుష్కశెట్టి లీడ్ రోల్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘పుట్టగానే బ్రహ్మ ముడి పెట్టరో.. వయసు తాకి జంట కట్టెరో.. బతుకునంత తోడులోన చూసెరో.. అడుగు అడుగు మొదలుపెట్టెరో..’
అంటూ జానపద ధోరణిలో సాగిన ఈ పాటను కృష్ణ రాయగా, నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచారు. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించారు. రాజు సుందరం నృత్య రీతుల్ని సమకూర్చారు. కొత్తగా పళ్లైన హీరోహీరోయిన్ల నడుమ.. సాంస్కృతిక శోభతో ఓ సంబరంగా ఈ పాటను దర్శకుడు క్రిష్ చిత్రీకరించారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన అడవుల నేపథ్యంలో ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్ ఉత్సవాన్ని తలపించింది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కటాసాని, ఆర్ట్: తోట తరణి, సమర్పణ: యూవీ క్రియేషన్స్, నిర్మాణం: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

