Garividi Lakshmi | ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతానికి చెందిన ప్రముఖ జానపద, బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ నటి ఆనంది ప్రధాన టైటిల్ పాత్రలో నటిస్తుండగా, రాగ్ మయూర్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మగవారి ఆధిపత్యం ఉండే సాంప్రదాయ బుర్రకథ మరియు జానపద కళారంగంలో ఒక సామాన్య మహిళ చేసిన అద్భుత పోరాటం ఆధారంగా ఈ కథ రూపొందింది. 90వ దశకంలో ఏకంగా 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించిన గరివిడి లక్ష్మి ప్రయాణాన్ని ట్రైలర్లో అత్యంత ఆకట్టుకునేలా చూపించారు. ఉత్తరాంధ్ర యాస, బాడీ లాంగ్వేజ్‌తో పాటు లక్ష్మి పాత్రలో ఆనంది ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోంది. ఇక చరణ్ అర్జున్ అందించిన జానపద బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి జనరేషన్‌కు తెలియని ఒక గొప్ప జానపద కళాకారిణి జీవిత విశేషాలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.